సుల్తానేట్ అనేక ప్రాంతాల్లో తాజాగా వర్షం మొదలు
- March 07, 2016
"వర్షం కురుస్తోంది... మేము సంతోషంగా సముద్రంలో ఈతను ఆస్వాదించడానికి నిర్నయిన్చుకోన్నాం.... నేను ఇప్పటికీ సముద్రపు అలలు బలం గుర్తు చేసుకొంటున్నాను. ఆ కెరటాల ధ్వని ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది. ఆ తరంగాల ధ్వని నాతో మాట్లాడుతున్నట్లుగా ... సముద్రం నుండి దూరంగా వెళ్ళిపొమ్మని నాకు చెప్పినట్లుగా...ఆ అనుభూతి. బహుశా నేను ఆ సూచనను గ్రహించినట్లితే నా దాయుదుడైన బంధువు జీవితాన్ని రక్షించుకోనేవాడిని . "
సుల్తాన్ అల్ బలుషి విషాద గాధ అందరికీ సుపరిచితమే... వాతావరణ సరిగా లేదని అధికారులు భద్రతా హెచ్చరికలు పదే పదే చేస్తున్నా పట్టించుకోకుండా ' వినోదం ' పేరిట ఒక వెర్రి నిర్ణయంతో ఈ కధ మొదలవుతుంది. సివిల్ ఏవియేషన్ పబ్లిక్ అథారిటీ కటినమైన సముద్రపు కెరటాల నుండి వెఌపొమ్మనె హెచ్చరికలు పెడ చెవిన పెట్టి... సుల్తాన్ మరియు ఆయన బంధువు కేవలం పులకింతల కోసం సముద్రంలోనికి దిగినట్లు తెలిపాడు. వారి నిర్ణయం బాగా ముగియలేదు.
" తమ ప్రాణాలు..ఎగిసిపడుతున్న సముద్రంలో... ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయని గ్రహించి నేను పెద్ద పెట్టున కేకలు పెట్టాను...దాంతో సముద్రపు ఒడ్డున ఉన్నవారు చాలా ఆలస్యంగా...నా కేకలు విన్నారు...తర్వాత వారిలో ఎవరో స్పందించి...బలమైన చేతితో...నన్ను ఒడ్డుకు చేర్చారు.. నేను కొంత సమయం స్పృహ తప్పాను...కొద్దిసేపు తర్వాతా నేను స్పృహలోనికి వచ్చి నా దాయుదుడైన బంధువు కోసం..ఆత్రుతగా చూశాను.. అతడు నాతో లేడని గ్రహించాను...నన్ను రక్షించినవారు తాను ఒక్కడినే సముద్రంలో మునిగిపోతున్నట్లుగా భావించారు...అతనిని కోసం అన్వేషణ జరిపారు.. కొంత సమయం తర్వాత తన దాయుదుడైన బంధువు సమీపంలోని ఒక ఇసుక దిబ్బ మీద చనిపోయినట్లుగా చెప్పారు.
ఇటువంటి అనుభవాన్ని ఈ రోజు నుండి మరో వారం పది రోజులు కొందరు ఎదుర్కొనున్నారని సివిల్ ఏవియేషన్ పబ్లిక్ అథారిటీ పేర్కొంది. కటినమైన సముద్ర తరంగాలు...మా వద్దకు రావద్దని సంకేతాలు ఇస్తున్నా....పలువురు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. కేవలం పులకింతల కోసం అల్లకల్లోల సముద్ర కెరటాల మధ్య ప్రాణాలు విడిచేందుకు ఉబలాటపడుతున్నారని వారు హెచ్చరిస్తున్నారు,భారీ వర్షం....
ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురవనుంది ఇప్పటికే అనేక అంతర్గత ప్రాంతాల్లో కుండపోత వాన మొదలయ్యంది. ఎప్పటి మాదిరిగానే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. " మీ ప్రాణాలను...ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని సివిల్ ఏవియేషన్ పబ్లిక్ అథారిటీ ఉన్నతాధికారి హమీద్ అల్ బరశ్ది టైమ్స్ అఫ్ ఒమాన్ కు తెలిపారు. ఈ భారీ వర్షం కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.అలాగే, గత వారంతో సరి పోల్చితే, ఈ వారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వర్షం కురిసే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాణాలు పణంగా పెట్టి ఇంటిని వదిలి రావద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







