వ్యాక్సిన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

- June 15, 2021 , by Maagulf
వ్యాక్సిన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్న ఓ పురుషుడు, మరో మహిళను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టైన ఈ ఇద్దరు ప్రవాసీయులను టార్గెట్ గా చేసుకొని కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అర్హులైన అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. దిగుమతి అవుతున్న వ్యాక్సిన్ బ్యాచుల ఆధారంగా ఓ ప్రణాళికతో ప్రాధాన్య వర్గాలుగా వ్యాక్సిన్ అందిస్తోంది. అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అమాయకులైన వారు, కొందరు ప్రవాసీయులు రిజిస్ట్రేషన్లకు ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా చేసుకున్న నిందితులు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com