ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ప్రయాణీకులకు భద్రత-హైదరాబాద్ విమానాశ్రయం
- June 16, 2021
హైదరాబాద్: ప్రయాణీకులు, విమానాశ్రయ సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యంగా మారింది. విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ఉదా: ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ల వద్ద క్యూ నిర్వహణ, ప్రయాణీకుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, రద్దీని నివారించడం భద్రతకు కీలకంగా మారాయి.ప్రయాణీకుల సౌలభ్యం కోసం అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాజాగా సెక్యూరిటీ కెమెరాలు, కృత్రిమ మేధ వీడియో అనలిటిక్స్ కలిపిన క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అమలులోకి తెచ్చింది. ఇది విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ప్రయాణీకులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి, రద్దీని తగ్గించి తద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

దీనిని GHIAL ఈ టెక్నాలజీలో భాగస్వామి అయిన ఆల్‌గోవిజన్ టెక్నాలజీస్‌తో కలిసి అమలు చేస్తోంది.కెమెరా ఆధారిత వీడియో అనలిటిక్స్‌ను ఉపయోగించే ఈ స్మార్ట్ క్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని పర్యవేక్షిస్తూ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల విమానాశ్రయంలో ప్రయాణీకులు ఎంత సేపు నిరీక్షించాలి, వారి సర్వీస్ టైమ్ ఎంత పడుతుంది వంటి వివిధ కీలక అంశాలు ప్రయాణికులకు ముందుగానే తెలుస్తాయి. తద్వారా వారు రద్దీగా లేని మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు.ఈ అధునాతన వీడియో అనలిటిక్స్ - వివిధ కెమెరాల నుండి అందే వీడియోలను విశ్లేషించి, ప్రయాణీకుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడానికి డీప్ లెర్నింగ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఉపయోగిస్తుంది.దీని ద్వారా క్యూ మేనేజ్‌మెంట్‌తో పాటు, కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన, తప్పుడు మార్గంలో వచ్చే వాటిని గుర్తించడం లాంటి వాటిని కూడా పసికట్టవచ్చు.

ప్రదీప్ పణికర్,CEO- GHIAL మాట్లాడుతూ, "ప్రస్తుత కోవిడ్ సమయంలో ప్రయాణీకుల భద్రత ముఖ్యం. ప్రయాణీకులు సురక్షితంగా ఉండడం కోసం GHIAL అనేక భద్రతా చర్యలను తీసుకుంటోంది. ఈ స్మార్ట్ క్యూ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. వినూత్న సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడంలో GHIAL ఎల్లప్పుడూ ముందుంటుంది. విమాన ప్రయాణంపై విశ్వాసాన్ని పెంచే ఈ AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో ఆల్‌గోవిజన్‌తో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది.” అన్నారు.
ఆల్గోవిజన్ సీఈఓ కె.శ్రీనివాసన్, ‘‘హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సహకరించిన జీఎంఆర్ గ్రూపు వారి నమ్మకానికి మా కృతజ్ఞతలు. కృత్రిమ మేధ/మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ప్రయాణికుల రాకపోకలను నియంత్రించడానికి మా క్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ సహాయపడుతుంది. ” అన్నారు.
ప్రయాణీకుల భద్రతపై దృష్టి సారించిన GHIAL వద్ద ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఎలాంటి ఆటంకాలూ లేని కాంటాక్ట్-లెస్ ఈ-బోర్డింగ్, ప్రతి ప్రయాణీకుడికి థర్మల్ స్కానింగ్, వివిధ ప్రదేశాలలో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ల లభ్యత, రిమోట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, సామాజిక దూర నిబంధనలను పాటించేలా ఎంట్రీ గేట్ల కేటాయింపు మరియు చెక్-ఇన్ ఐలాండ్స్.. వీటిలో కొన్ని.
విమానాశ్రయంలోని అన్ని ఎలివేటర్లనూ సాంప్రదాయ పుష్-బటన్ నుండి ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీపై ఆధారపడిన, సురక్షితమైన టచ్-లెస్ విధానానికి మార్చి ప్రయాణీకుల భద్రతను పెంచడం జరిగింది. ప్రతి ఉపయోగించిన ప్రతిసారీ ట్రాలీలు మరియు సామాన్ల ట్రేలను డిస్‌ఇన్ఫెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా, ప్రతి సెక్యూరిటీ స్క్రీనింగ్ హ్యాండ్ బ్యాగేజ్ ట్రే ప్రయాణీకుల కోసం కలెక్షన్ పాయింట్ వద్దకు వచ్చే ముందు డిసిన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తుంది.
ఇప్పటికే దేశీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయం కలిగిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. ఈ కాంటాక్ట్-లెస్ బోర్డింగ్ ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైనది. ఈ ఈ-బోర్డింగ్ విమానాశ్రయంలో ప్రవేశం నుండి ప్రారంభించి, చెక్-ఇన్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ గేట్ మరియు చివరకు విమానంలోకి ప్రవేశించే ముందు బోర్డింగ్ బ్రిడ్జ్ చెక్ సహా అన్ని ముఖ్య ప్రదేశాలలో అందుబాటులో ఉంది. ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్లలోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ ఉపయోగించి ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవచ్చు.ఈ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరిస్తున్నారు.ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా, స్పైస్ జెట్, ఎయిర్ ఆసియా, ఎమిరేట్స్ మరియు గోఎయిర్ అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఈ-బోర్డింగ్ ఉపయోగించడం ప్రారంభించిన కొన్ని విమానయాన సంస్థలు. త్వరలో అన్ని ఇతర విమానయాన సంస్థలూ దీన్ని దశల వారీగా అమలు చేయనున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







