కోవిడ్ 19: సీనియర్ వలసదారుడైన ప్రముఖ వైద్యుడి మరణం
- June 17, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ దేశంలో సుదీర్ఘ కాలంగా వైద్య సేవలందించిన ఓ ప్రముఖ వైద్యుడు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ వలసలన్ రాఘవన్, ఎమర్జన్సీ మెడిసిన్ ఫిజీషియన్ హోదాలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ లో పనిచేశారు. 76 ఏళ్ళ ఈ ప్రముఖ డాక్టర్ సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో యాక్సిడెంట్స్ అలాగే ఎమర్జన్సీ డిపార్టుమెంటులో 47 ఏళ్ళుగా సేవలందించారు. చిన్న హెల్త్ సెంటర్ గా వున్నప్పటినుంచి ఎస్ఎంసి అభివృద్ధి చెందిన వైనాన్ని ఆయన తన కళ్ళతో చూశారు. ఆ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. బహ్రెయిన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఫార్ములా వన్ బహ్రెయిన్ ఎమర్జన్సీ టీంలో వ్యూహాత్మక భాగం పొందారు. ఫార్ములా వన్ బహ్రెయిన్ విఐపీ టవర్ లో ఎమర్జన్సీ ఫిజీషియన్ హోదాలో పని చేశారు. సిట్రా ఫీల్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆసుపతరిలో ఆయనకు వైద్య చికిత్స అందించడం జరిగింది. భార్య మీరా, కుమారులు రాకేష్ మరియు బ్రిజేష్ ఆయనకు వున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







