UPDATE: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి
- June 17, 2021
కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు. ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. భారత్ అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది.
అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను కువైట్ కు అనుమతించాలంటూ మంత్రిమండలికి సిఫారసు చేసింది సుప్రీం కమిటీ ఫర్ కరోనా ఎమర్జెన్సీ.
కువైట్ లో తాజాగా 'డెల్టా వేరియంట్' నమోదవడంతో పరిస్థితులను మరింత జాగ్రత్తగా అంచనావేస్తోంది కువైట్ ప్రభుత్వం. సుప్రీం కమిటీ చేసిన సిఫారసును మంత్రి మండలి ఆమోదిస్తూ వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను మాత్రమే ఆగస్టు ప్రారంభంలో కువైట్ కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఎవరికి అనుమతి?
కోవిడ్ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా యొక్క రెండు డోసులు లేదా జాన్సన్ & జాన్సన్ వారి సింగల్ డోసు వ్యాక్సిన్ పొందిన వారు అర్హులు..అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







