మనీ లాండరింగ్: ఇద్దరికి జైలు శిక్ష
- June 18, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ అభియోగాల నేపథ్యంలో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు 5,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది. మొదటి నిందితుడి నుంచి 20,000 బహ్రెయినీ దినార్లు, రెండో నిందితుడి నుంచి 10,000 బహ్రెయినీ దినార్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. అక్రమ మార్గం ద్వారా నిందితులు మనీ లాండరింగ్ చేశారని ఫైనాన్షియల్ క్రైమ్స్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ తెలిపారు. ఇద్దరు నిందితులు చేపట్టిన మనీ లాండరింగ్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. విచారణలో దొరికిన ఆధారాల నేపథ్యంలో నిందితులకు శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,మనామా)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







