మార్చ్‌ 10న యానిమల్‌ పార్క్‌ ప్రారంభం

- March 07, 2016 , by Maagulf
మార్చ్‌ 10న యానిమల్‌ పార్క్‌ ప్రారంభం

డైనోసార్స్‌, గాడ్జిల్లా, కింగ్‌ కాంగ్‌ వంటి పురాతనకాలం నాటి జీవులను దగ్గరనుంచి చూసే అవకాశం కలగనుంది. యానిమల్‌ పార్క్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అచ్చంగా నిజమైన డైనోసార్స్‌, గాడ్జిల్లా, కింగ్‌ కాంగ్‌లను తలపించేలా వాటి ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. కతార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ని గురువారం ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 2 వరకు ఉండే ఈ యానిమల్‌ పార్క్‌ని దుబాయ్‌కి చెందిన సిఎసి ఈవెంట్స్‌ సంస్థ ఏర్పాటు చేసింది. ఎజె ఎంటర్‌టైన్‌మెంట్‌ - దోహా, ఖతార్‌ టూరిజం అథారిటీతో కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రతిమలూ విభిన్న రకాలైన శబ్దాలతో, ఆశ్చర్యం కలిగించే మూమెంట్స్‌తో సందర్శకుల్ని అలరించనున్నాయి. తోక ఆడించడం, నోటిని తెరవడం, నీటిని వెదజల్లడం వంటివి ఇందులో మరికొన్ని ఆకర్షణీయ అంశాలు. ఆయా జీవులకు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లీషు, అరబిక్‌ బాషల్లో పొందుపరిచారు. పార్క్‌లో కిడ్స్‌ ఎరీనా ఉంటుంది. ఇందులో చిన్న చిన్న యానిమల్‌ మోడల్స్‌ని ఉంచారు. వాకింగ్‌ అండ్‌ కౌబాయ్‌ డైనోసార్‌ పార్క్‌ అంతటా తిరుగుతూ సందర్శకుల్ని అలరించనుంది. ఉదయం 4 నుంచి 11 గంటలవరకు ప్రతిరోజూ, శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్క్‌ని తెరిచి ఉంచుతారు. స్కూల్‌ విద్యార్థుల కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక సందర్శనకు అనుమతిస్తారు. 12 ఏళ్ళలోపు పిల్లలకు 15 ఖతార్‌ రియాల్స్‌ టిక్కెట్‌, పెద్దలకు అయితే 25 ఖతార్‌ రియాల్స్‌ టిక్కెట్‌ ధరను నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com