బహ్రెయిన్ స్కూల్ గార్డ్స్‌ని గాయపర్చిన మహిళ
- March 07, 2016
ఓ మహిళ, పబ్లిక్ స్కూల్‌కి చెందిన ఇద్దరు ఫిమేల్ గార్డ్స్‌ని కత్తితో గాయపర్చింది. స్కూల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఆ మహిళ ప్రయత్నించగా, గార్డ్స్ ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా గార్డ్స్‌కి గాయాలయ్యాయని మినిస్ట్రీ వెల్లడించింది. దాడికి యత్నించిన మహిళ పేరెంట్ కాదనీ, అలాగే స్కూల్ స్టాఫ్ కూడా కాదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తనతోపాటు ఓ కత్తిని తెచ్చుకోవడం ద్వారా ఆ మహిళ దాడికి ముందుగానే వ్యూహరచన చేసినట్లు అర్థమవుతుందని ప్రకటనలో పేర్కొంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. దాడికి యత్నించిన మహిళ నుంచి కత్తిని లాక్కునేందుకు ప్రయత్నించడంతో సిబ్బందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించి, దాడికి యత్నించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







