గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

- June 20, 2021 , by Maagulf
గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న గోడౌన్ ప్రాంతం 10,000 చదరపు మీటర్లు విస్తరించి ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫోర్స్ కు చెందిన ఏడు బృందాలు శ్రమించాల్సి ఉంచింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు సభాన్, సల్మియా, అర్దియా, మిన అబ్ధుల్లా ఫైర్ బృందాలు తరలొచ్చాయి. ఇదిలాఉంటే ప్రమాదానికి సంబంధించి కారణాల కనక్కుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com