ఫైనల్ కి చేరుకున్న భారత్
- February 05, 2026
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ (Under-19 World Cup) లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆరోన్ జార్జ్ 95 బంతుల్లో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రి 62 పరుగులు చేశారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 310/4 పరుగులు చేసింది. ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తాజా వార్తలు
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!







