మార్చ్ 9న సూర్య గ్రహణం..
- March 07, 2016
మాఘ మాసం కృష్ణ పక్షం అమావాస్య బుధవారము అనగా 09 మార్చి 2016 రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభ రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది.
స్పర్శ కాలం ఉదయం సూర్యోదయానికి ముందు 05.17సూర్యోదయం ఉదయం (హైదరాబాద్) 06.32మోక్షకాలం ఉదయం 06.48మొత్తం పుణ్య కాలం 00.16గ్రహణం 05.17 నుండి మొదలైనా కూడా 06.32 నుండి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి.
నిత్యభోజన ప్రత్యాబ్దీకాలు -
ముందు రోజు రాత్రి భోజనం చేయరాదు మోక్షానంతరం నిత్య భోజన, ప్రత్యాబ్దీకాలు చేసుకోవచ్చు.
గ్రహణ గోచారము
రేవతీ నక్షత్రమువారు ఈ గ్రహణమును చూడరాదు. మేష, కర్కాటక, వృశ్చిక, ధను రాశులవారికి శుభ ఫలితముమిథున, సింహ, తులా, మీన రాశుల వారికి మధ్యమ ఫలమువృషభ, కన్య, మకర, కుంభ రాశుల వారికి అధమ ఫలము
పాటించవలసిన నియమాలు
శుభఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనడానికి సరైన సమయంగా తెలుసుకోవాలి.మధ్యమ ఫలము ఉన్నవారు మరియు అధమ ఫలము ఉన్నవారు శక్తి కొద్దీ వస్త్ర, ధాన్య, శాకాది, దానాలు చేసుకోవాలి.
గ్రహణ కాలం వరకూ దేవతా మూర్తులమీద, నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి - గ్రహణ అనంతరం తీసి వేయాలి.
మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతా మూర్తులను శుద్ధ పరచుకోవాలి. గ్రహణసమయంలో దేవతా పూజలు అభిశేకాదులు చేయకూడదు.
ఉపదేశిత మంత్రము కానీ ఏదైనా దేవతానామాన్ని జపిస్తే గణనీయ ఫలము అని శాస్త్రవాక్యము. గర్భవతులు గ్రహణం చూడరాదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







