భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది : అమితాబ్
- March 07, 2016
'నేనొక ట్యూబర్ కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్ కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను.2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు.దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







