కొవాక్సిన్ తీసుకున్నవాళ్ళు దుబాయ్ ఎప్పుడు రావచ్చు?
- June 21, 2021
దుబాయ్: ఇండియాలో చిక్కుకుపోయిన ప్రవాసీయుల నుండి భారీగా అందుతున్న అభ్యర్థనల ఆధారంగా దుబాయ్ ప్రభుత్వం వీరిని ఇక్కడకు వచ్చేందుకు జూన్ 23, 2021 నుండి అనుమతిచ్చింది. యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు అంటూ కొసమెరుపు పెట్టింది.
మరి యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
- ఫైజర్
- ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
- సినోఫార్మ్
- స్పుత్నిక్
కొవాక్సిన్ తీసుకున్నవారి పరిస్థితి ఏంటి?
భారత్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి ఆస్ట్రాజెనెకా ఫార్ములా ను ఉపయోగించి చేసిన కోవిషీల్డ్..మరోటి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ వారి కొవాక్సిన్. కోవిషీల్డ్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉండటంతో ప్రపంచ దేశాలు కోవిషీల్డ్ వేసుకున్న వారిని తమ దేశాలకు అనుమతిస్తున్నాయి. అయితే, కొవాక్సిన్ కు మాత్రం ఇంకా WHO వారి ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఫేస్-3 ట్రయల్ డేటా ఆధారంగా WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) ను పొందడానికి వీలవుతుంది కనుక కొవాక్సిన్ ఫేస్-3 ట్రయల్ డేటాను విడుదల చేయడం ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ డేటా జులై లో విడుదల అవుతుందనీ, WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) ను పొందడానికి సాధ్యమైనంత త్వరగా పనులు వేగవంతం చేస్తున్నాం అని భారత్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధిపతి డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు.
ఇదిలా ఉంటే, విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్లే వారు భారత్ ప్రభుత్వం పై సోషల్ మీడియా ద్వారా తమ అభ్యర్థనలను పంచుకుంటున్నారు. కాబట్టి, కొవాక్సిన్ తీసుకున్నవారు ప్రయాణించాలంటే కొన్నిరోజులు వేచిఉండక తప్పదు!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







