డొమస్టిక్ వర్కర్ల క్వారంటైన్ ఖర్చు రిక్రూట్మెంట్ ఆఫీసులదే
- June 22, 2021
సౌదీ: డొమస్టిక్ వర్కర్ల ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ ఖర్చులను రిక్రూట్మెంట్ ఆఫీసులే భరించాలని మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనపై మంత్రిత్వ శాఖ ప్రకటనకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు కూడా ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పేసింది. దీంతో మంత్రిత్వ శాఖ ప్రకటనకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఆయా డొమస్టిక్ వర్కర్ల క్వారంటైన్ ఖర్చులను రిక్రూట్మెంట్ ఆఫీసు వర్గాలే భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ ముందు ఓనర్లు, రిక్రూట్మెంట్ అఫీసు ప్రతినిధి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మంత్రిత్వశాఖ ప్రకటనకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు కొత్త నిబంధనలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించాయి. క్వారంటైన్ భారం డొమస్టిక్ వర్కర్లే భరించాల్సి ఉంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన మంత్రిత్వ శాఖ మునుపటి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి గల హేతుబద్ధత, చట్టపరమైన అభిప్రాయాలను వివరించింది. తమ నిర్ణయంలో ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని వారికి తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!