దుబాయ్ విమానాశ్రయం: ఎమిరేట్స్ ఐడి లోనే అన్ని వివరాలు
- June 22, 2021
దుబాయ్: సెలవులు వస్తున్నాయి..అందరు ఇప్పటిదాకా ఇళ్లల్లో ఉండీ ఉండీ విసుకెత్తిపోతున్నారు. మరి ప్రయాణం అంటే పిసిఆర్ టెస్టు సర్టిఫికెట్లు, వ్యాక్సిన్ కార్డులు లేకుండా అయ్యే పరిస్థితి ఇంకా లేదు కదా! కాబట్టి సెలవులకు ప్రయాణించేవారికి సర్టిఫికెట్ల బెడద లేకుండా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక సరికొత్త ఆలోచనతో తమ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంతో యూఏఈ నివాసితులు దుబాయ్ విమానాశ్రయంలో కోవిడ్ నెగటివ్ టెస్ట్ రిపోర్టు, వ్యాక్సిన్ కార్డును చూపించాల్సిన అవసరం ఉండదు. 'ఎమిరేట్స్ ఐడీ' లను చూపిస్తే సరిపోతుందట!
దుబాయ్‌లో జరుగుతున్న 'అరబ్ హెల్త్' ఎక్సిబిషన్ లో ఈ సౌకర్యం గురించి వివరించారు.
ప్రయాణీకులు చెక్-ఇన్ డెస్క్‌ల వద్దకు వచ్చినప్పుడు వారి ఎమిరేట్స్ ఐడిని, కార్డ్ రీడర్లో పెట్టాలి. అంతే, మీ కోవిడ్ రిపోర్టులు, వ్యాక్సిన్ కార్డు వివరాలు ఎయిర్‌లైన్స్ వారికి అందుతాయి. ఈ వేసవిలో వేలాది కుటుంబాలు విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నందున ఈ చర్య ఎయిర్‌పోర్టు సర్వీసులను వేగవంతం చేస్తుంది అని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అడెల్ అల్ రెడ్హా అన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







