ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ...
- March 08, 2016
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు మహిళల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకనుంచి ఇంటి దగ్గర ఉండి పనిచేసేందుకు వీలుగా అవకాశం తెచ్చిపెట్టింది. 'ఐ వర్క్@హోమ్' పేరిట ప్రత్యేక పోర్టల్ ను తీసుకొచ్చి తమ సంస్థకు చెందిన ఉద్యోగినులు ల్యాప్ టాప్ ద్వారా బ్యాంకు లావాదేవీలు చూసేందుకు వీలు కల్పించింది. ఈ విధానం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు అమితంగా ఉపయోగపడనుంది.తమ బ్యాంకులో పనిచేసే మహిళలకు పెద్దగా ఇబ్బందులు కలగకూడదని ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్ మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్వేలో మహిళలు మెటర్నటీ కారణంగా విధులకు దూరం కావాల్సి వస్తుందని, ఇంకొందరైతే రాజీనామాలు చేస్తున్నారని గుర్తించామని చెప్పారు.
'ఇకపై మహిళలు ఇబ్బందుల కారణంగా విధులకు దూరం అయ్యే సమస్య లేకుండా ఓ బలమైన వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించాం. వర్క్ ఎట్ హోమ్ విధానం తెచ్చాం. ఇప్పటికే 50 మంది మహిళలు ఇలా పనిచేస్తున్నారు. మరో 125 మంది ఇలా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇంటి దగ్గర ఉండి పనిచేసే వారి సంఖ్య త్వరలోనే 500కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీనామాలు చేసినవారు కూడా.. ఈ కొత్త విధానం చూసి వాటిని ఉపసంహరించుకునేందుకు ఆలోచిస్తారు' అని ఆమె చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకులో 30 శాతం మంది అంటే 73 వేల మంది మహిళలు పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







