'ఏం మాయ చేసావే కాంబినేషన్ లో మరో సినిమా..

- March 08, 2016 , by Maagulf
'ఏం మాయ చేసావే కాంబినేషన్ లో మరో సినిమా..

'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది.తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com