పర్యాటకులకు కోవిడ్ వ్యాక్సినేషన్ గైడ్

- June 23, 2021 , by Maagulf
పర్యాటకులకు కోవిడ్ వ్యాక్సినేషన్ గైడ్

అబుధాబి: టూరిస్టులు, విజిట్ వీసా కలిగినవారికి కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతులు జారీ అయ్యాయి.అబుధాబి జారీ చేసిన వీసా కలిగినవారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. వ్యాక్సినేషన్ సందర్భంగా అబుధాబి ఎంట్రీ స్టాంప్ వంటి ఆధారాల్ని వ్యాక్సినేషన్ సందర్భంగా చూపించాల్సి వుంటుంది. సెహా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, అల్ హోసన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం.. వ్యాక్సిన్ ఎంపిక చేసుకోవడం (సినోఫామ్ లేదా ఫైజర్ వ్యాక్సిన్), వ్యాక్సిన్ కేంద్రం ఎంపిక చేసుకోవడం, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, వ్యక్తిగత వివరాలను పేర్కొనడం.. ఇలా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. కాగా, యూఏఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఇప్పటిదాకా 87 శాతం మంది అర్హులైన జనాభాకి వ్యాక్సిన్ చేయడం జరిగింది. 14.6 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com