దుబాయ్ నుండి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

- June 23, 2021 , by Maagulf
దుబాయ్ నుండి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

దుబాయ్: భారత్ లో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా తిరిగి మళ్ళీ విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసందే.నేడు IX 250 ఎయిర్ ఇండియా విమానంలో 100 మంది ప్రయాణికులు దుబాయ్ నుండి విజయవాడ కు చేరుకున్నారు.ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లను విమానాశ్రయ అధికారులు పర్యవేక్షించారు. తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు. అలాగే ప్రవాసాంధ్రులను వారి వారి గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com