హైదరాబాద్ విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుతో సురక్షిత ప్రయాణం
- June 23, 2021
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుతో సురక్షిత ప్రయాణం
- దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మహమ్మారికి వ్యతిరేకంగా, కోవిడ్ ప్రోటోకాల్‌ల అమలులో కఠిన చర్యలు తీసుకుంటోంది.
- కోవిడ్ విషయంలో ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో సైనేజ్‌లను ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ చర్యలు, ప్రక్రియలకు సంబంధించి ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం కోవిడ్ జాగ్రత్తల గురించి సమాచారం వివిధ ప్రదేశాలలో ప్రదర్శించబడుతోంది.
- కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి, ప్రయాణీకులు ఇంట్లో చెకిన్ చేయమని లేదా సెల్ఫ్-చెకిన్ సౌకర్యం, సెల్ఫ్-బ్యాగ్ ట్యాగ్ సౌకర్యం లాంటి సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలను ఉపయోగించుకోమని ప్రోత్సహిస్తున్నారు.
- విమానాశ్రయం ఫోర్కోర్ట్ ప్రాంతంలో, చెక్-ఇన్ హాల్స్‌లో భౌతిక దూర నిబంధనల ప్రకారం కాంటాక్ట్ లెస్ బోర్డింగ్ అనుభవం కోసం సెల్ఫ్-చెకిన్ కియోస్క్‌లను ఏర్పాటు చేసారు. టచ్-లెస్ టెక్నాలజీని కలిగిన ఈ QR కోడ్ ఫ్రెండ్లీ కియోస్కులు చెకిన్ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడతాయి. ఇవి బోర్డింగ్ కార్డ్ మరియు బ్యాగేజ్ ట్యాగ్‌లను ప్రింట్ చేసి ఇస్తాయి.
- GHIAL కొన్ని కఠినమైన భద్రతా చర్యలతో పాటు ప్రయాణీకులు ఎలాంటి అవాంతరాలూ లేని కాంటాక్ట్-లెస్ బోర్డింగ్‌పై దృష్టి సారించింది. వివిధ ప్రదేశాలలో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్లు, భౌతిక దూరం గుర్తులు, ప్రయాణికుల ఎదుట లేకుండానే వేరొక చోటి నుంచి సమాచారం ఇచ్చే రిమోట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ప్రవేశ ద్వారాల కేటాయింపు, భౌతిక దూర నిబంధనలను పాటించేలా డిపార్చర్ ప్రయాణికులకు చెక్-ఇన్ ఐలాండ్స్ కేటాయింపు వీటిలో కొన్ని.
- టెర్మినల్ లోపల డెస్క్‌లు, కుర్చీలు, ఎలివేటర్లు, రైలింగ్‌లు, CUSS మెషీన్లు, ట్రాలీలు, హ్యాండిల్స్, ట్రేలు, సామాను బెల్టులు వంటి ఎక్కువగా తాకే అవకాశం ఉన్న వాటిని క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నారు. ప్రయాణీకులు, విమానాశ్రయ సిబ్బంది కోసం సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ మెషీన్లను టెర్మినల్ అంతటా ఉంచారు.
- ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసం, వినియోగించిన ప్రతిసారీ ట్రాలీలు, బ్యాగేజ్ ట్రేలను డిసిన్పెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా, ప్రతి సెక్యూరిటీ స్క్రీనింగ్ హ్యాండ్ బ్యాగేజ్ ట్రే ప్రయాణీకుల వినియోగం కోసం కలెక్షన్ పాయింట్ వద్దకు రాకముందే డిసిన్పెక్షన్ టన్నెల్ ద్వారా వెళుతుంది. ఇలా ప్రయాణీకులు ఉపయోగించడానికి పరిశుభ్రమైన ట్రేలు అందుబాటులో ఉంటాయి.
- డొమెస్టిక్ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. ఈ టచ్-లెస్ బోర్డింగ్ విమానాశ్రయ ప్రయాణంలో ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైనది. మొదటి నుంచి చివరి వరకు ఉండే ఈ ఈ-బోర్డింగ్ ప్రక్రియ దేశంలో విమాన ప్రయాణీకుల నిర్వహణ ప్రక్రియలో ఒక సమూల మార్పుకు కారణమైంది. ఇది విమానాశ్రయంలో టెర్మినల్ ఎంట్రీ నుండి చెకిన్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ గేట్ , విమానంలోకి ప్రవేశించే ముందు బోర్డింగ్ బ్రిడ్జ్ చెక్ సహా అన్ని ప్రాంతాలలో ఉపయోగపడుతుంది.
- ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌లను ఉపయోగించి ప్రయాణించడానికి హైదరాబాద్ విమానాశ్రయం యొక్క ప్రత్యేకమైన పేపర్ లెస్ ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని బోర్డింగ్ గేట్లలో బోర్డింగ్ కార్డ్ స్కానర్లతో కాంటాక్ట్-లెస్ ఈ-బోర్డింగ్ గేట్లు ఉన్నాయి. ఈ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులకూ విస్తరిస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా, స్పైస్ జెట్, ఎమిరేట్స్, గోఎయిర్ అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఈ-బోర్డింగ్ ఉపయోగించడం ప్రారంభించగా, త్వరలో ఇతర విమానయాన సంస్థలు కూడా దశలవారీగా ఈ-బోర్డింగ్ ను అమలు చేస్తాయి.
- GMR నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సురక్షితమైన కాంటాక్ట్-లెస్ ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి నిరంతరం వినూత్న మార్గాల కోసం అన్వేషిస్తుంది. దీనికి అనుగుణంగా, విమానాశ్రయంలోని అన్ని ఎలివేటర్లను పుష్-బటన్ కంట్రోల్ నుండి సురక్షితమైన టచ్-లెస్ ఎలివేటర్లుగా మార్చారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీపై ఆధారపడిన ఈ టెక్నాలజీలో ఎలివేటర్ బటన్‌ను తాకే అవసరం లేకుండా 0.1-10 సెంటీమీటర్ల దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చు.
- టెర్మినల్‌లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతూ నిరంతరం మూడు (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) భాషలలో ప్రకటనలు చేస్తున్నారు. అలాగే ల్యాండ్సైడ్లో రక్షా సిబ్బంది పోర్టబుల్ మైక్‌లతో వీటి గురించి హెచ్చరిస్తున్నారు. నిబంధనలు కఠినంగా పాటించడం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
- కోవిడ్ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండడానికి విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్ టీమ్‌ల సహాయంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల అమలుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. కోవిడ్ భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి GHIAL కు చెందిన 20 మంది అధికారులను ప్రత్యేక పోలీసు అధికారులు(SPO)గా నియమించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని కోవిడ్ భద్రతా మార్గదర్శకాలను పాటించని ప్రయాణీకులు, సందర్శకులు, సిబ్బందికి జరిమానా విధించే అధికారం ఈ SPOలకు ఉంటుంది.
- సామాజిక దూరం, ఇతర జాగ్రత్తల కోసం ఫుడ్ కోర్టులు, లాంజ్‌లు, రిటైల్ షాపులలో పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించారు. అన్ని అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపు సదుపాయాలున్నాయి. భద్రత కోసం ఫుడ్ కోర్టులలో భౌతిక దూర గుర్తులు ఉన్నాయి.
- ప్రయాణీకుల భద్రత కోసం GMR ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలలో మొట్టమొదటిసారిగా కాంటాక్ట్ లెస్ ఫుడ్ ఆర్డరింగ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు HOI యాప్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఇది ప్రయాణికుల విమానాశ్రయ నావిగేషన్‌కు సహాయపడుతుంది. కాంటాక్ట్-లెస్ ఫుడ్ ఆర్డరింగ్, పేమెంట్ సర్వీసులు HOI యాప్ ప్రత్యేక లక్షణాలు. ప్రయాణీకులు వారి Android లేదా iOS పరికరంలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, సైన్-అప్ చేసి, వారి రాబోయే విమాన ప్రయాణ వివరాలను జోడించడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
- క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్‌తో విమానాశ్రయంలో కార్యాకలాపాలను మెరుగుపరిచేందుకు, రద్దీని తగ్గించేందుకు GHIAL ఒక పైలట్ ప్రాజెక్టులో కూడా పాల్గొంటోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీడియో అనలిటిక్స్ సహాయంతో విమానాశ్రయ భద్రత మరింత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన క్యూ నిర్వహణ వ్యవస్థ ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కాలంలో సురక్షితమైన, ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణానికి ఉపయోగపడుతుంది. అధునాతన కెమెరా ఆధారిత వీడియో అనలిటిక్స్ సొల్యూషన్ ప్రయాణీకుల రద్దీని; వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, భౌతిక దూరాన్ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది.
- అంతర్జాతీయ ప్రయాణాలకు RT-PCR నివేదిక తప్పనిసరి కావడంతో, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోవిడ్ టెస్టింగ్ కోసం ICMR మరియు NABL సర్టిఫైడ్ ల్యాబ్ అయిన మాప్మైజెనోమ్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ లెవల్ లేదా ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ ముందు భాగంలో ఈ పరీక్ష చేయుంకోవచ్చు. ఫలితాలు ఇమెయిల్ మరియు వాట్సాప్ ద్వారా లభిస్తాయి. నివేదిక యొక్క హార్డ్ కాపీ కూడా అందుబాటులో ఉంటుంది. రిపోర్టు కోసం వేచి ఉండే ప్రయాణీకుల కోసం వెస్టర్న్ ఎక్స్టెండెడ్ ప్లేట్ వద్ద ఒక లాంజ్ ఏర్పాటు చేసారు. ఈ ల్యాబ్ RT-PCR పరీక్షను పొందాలనుకునే వారికి 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

GMR ప్రతినిధి మాట్లాడుతూ, “భారత ప్రభుత్వ కోవిడ్ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకుల భద్రత కోసం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. విమానాశ్రయంలో అన్ని భద్రతా నిబంధనలనూ అమలు చేస్తుండగా, ఫేస్ మాస్క్‌లు ఉపయోగిస్తూ, భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ, అవసరమైన అన్ని కోవిడ్ నిబంధనలూ పాటించడంలో ప్రయాణీకులందరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నాము. మా విమానాశ్రయం గుండా ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి GHIAL తన వంతు కృషి చేస్తుంది”. అన్నారు.


తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









