చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం...18మంది మృతి!
- June 25, 2021
చైనా: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. తెల్లవారు జామున కావడంటతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించకపోవడంతోనే ఇంత భారీస్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తుంది.
ఇప్పటికి ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 16 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణ లోపాలుతోనే ఆ ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







