కోవిడ్ ఎఫెక్ట్ తో కాన్సులర్ సేవలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ
- June 25, 2021
కువైట్: కోవిడ్ 19 ప్రభావం కువైట్లోని భారత రాయబార కార్యాలయ కాన్సులర్ సేవలపై పడింది. కోవిడ్ కారణంగా జులై 1 వరకు కాన్సులర్ సేవలను నిలిపివేత్తున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అత్యవసర సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. [email protected] సేవల కోసం ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించి అపాయింట్మెంట్ పొందవచ్చు. రాబోయే రెండు వారాలకు సంబంధించి ఎంబసీ నిర్వహించే ఈవెంట్లు కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే..కువైట్లోని తమ మూడు పాస్ పోర్టు కేంద్రాల ద్వారా పాస్ పోర్టు సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఈ ఏడాదిలో కోవిడ్ కారణంగా ఎంబసీ కార్యాలయం కాన్సులర్ సేవలను నిలిపివేయటం ఇది రెండో సారి.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







