నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- October 05, 2026
జెడ్డా: గల్ఫ్ కప్ ఫైనల్‌కు యూఏఈ ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆరు చార్టర్ విమానాల్లోని అన్ని సీట్లు కేవలం 10 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలనుకునే అభిమానుల కోసం యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.
రిజిస్ట్రేషన్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విమానాల్లోని సీట్లన్నీ పూర్తిగా బుక్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
యూఏఈ జట్టు గల్ఫ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల్లో ఈ స్థాయిలో ఉత్సాహం నెలకొంది. శనివారం జెడ్డాలో జరిగిన సెమీఫైనల్లో ఒమన్‌పై యూఏఈ 1-0తో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో 2018 తర్వాత తొలిసారి గల్ఫ్ కప్ ఫైనల్‌లో యూఏఈ అడుగుపెట్టింది.
ప్రాంతీయ టైటిల్ కోసం యూఏఈ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు యూఏఈ 2007, 2013లో గల్ఫ్ కప్ టైటిళ్లను గెలుచుకుంది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆతిథ్య జట్టు సౌదీ అరేబియా కూడా ఫైనల్‌కు చేరుకుంది. ఆసియా ఛాంపియన్ ఖతార్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి సౌదీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.
దాదాపు 22 ఏళ్ల తర్వాత గల్ఫ్ కప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో సౌదీ బరిలోకి దిగుతోంది. మంగళవారం జెడ్డాలోని కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీలో జరగనున్న ఫైనల్‌కు భారీ సంఖ్యలో యూఏఈ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆరు చార్టర్ విమానాల సీట్లు నిమిషాల్లోనే పూర్తిగా బుక్ కావడం.. ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు నిదర్శనంగా నిలిచింది.
తాజా వార్తలు
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ







