కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- October 05, 2026
కువైట్: కువైట్ లో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరుగుతోంది. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు కువైట్‌లోని పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినల్స్ ద్వారా KD 10.15 బిలియన్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. గణాంకాల ప్రకారం.. ఈ ఎనిమిది నెలల్లో సుమారు 543.57 మిలియన్ కొనుగోలు లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 110,458 POS పరికరాలు ఈ చెల్లింపులను ప్రాసెస్ చేశాయి. రోజువారీ సగటున సుమారు KD 41.78 మిలియన్ల విలువైన చెల్లింపులు, అలాగే 2.24 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.
ఒక్కో POS లావాదేవీ సగటు విలువ సుమారు KD 18.67గా ఉంది. ఎనిమిది నెలల కాలంలో ఒక్కో POS టెర్మినల్ సగటున 4,900కు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అంటే రోజుకు 20కి పైగా లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక POS నెట్‌వర్క్ ద్వారా నెలకు సగటున సుమారు KD 1.27 బిలియన్ల చెల్లింపులు జరిగాయి. రిటైల్, సేవల రంగాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపుల వినియోగం కువైట్‌లో ఎంత విస్తృతంగా పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







