బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- October 05, 2026
మనామా: బహ్రెయిన్, మలేషియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల అగ్ర నాయకులు చర్చించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. మలేషియాలో జోహోర్ క్రౌన్ ప్రిన్స్ టుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. 2026 ఫార్ములా-1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్రౌన్ ప్రిన్స్ మలేషియా పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ ఏడాది నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ 22వ ఎడిషన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా బహ్రెయిన్–మలేషియా మధ్య సంబంధాలు వివిధ రంగాల్లో, పలు స్థాయిల్లో బలంగా కొనసాగుతున్నాయని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం, సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల రాజులు అందిస్తున్న మద్దతును ఆయన ప్రస్తావించారు.
2026 ఫార్ములా-1 గ్రాండ్ ప్రీ విజయవంతంగా నిర్వహించేందుకు మలేషియా అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం బహ్రెయిన్–మలేషియా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత విస్తరించడంతో పాటు పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు నాయకులు తెలిపారు.
అలాగే ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించారు. ఇరు దేశాల ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి చూపుతున్న నిబద్ధతకు టుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీం కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!







