క్యాన్సర్ వ్యాధిని నయంచేసే తులసి ఆకులు, నల్ల మిరియాలు
- March 08, 2016
తులసి ఆకులు, నల్ల మిరియాలు భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేస్తాయని అంటున్నాడు తనను డాక్టర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి. ఇండియాలో తాను దాదాపు లక్షమందికి వైద్యం చేశానని, దలైలామా, గతంలో మదర్ థెరెసా వంటి ప్రముఖులు తన వైద్యంతో ఆరోగ్యవంతులయ్యారని పంకజ్ నారమ్ అనే ఈయన చెబుతున్నాడు.ఓ టీవీ ఛానెల్ లో యోగా ఫర్ యూ అనే షో లో ఇలా లెక్చర్ ఇచ్చాడు. క్యాన్సర్ ను నయం చేసేందుకు కేవలం 11 తులసి ఆకులు, మూడు నల్ల మిరియాలు చాలట..ఓ టీవీకి చెందిన లాంహే అనే ఛానెల్ లో ఈయన ఇచ్చిన సలహాలకు ఆ ఛానెల్ భారీ మూల్యమే చెల్లించుకోవలసివచ్చింది. కమ్యూ నికేషన్స్ వాచ్ డాగ్ అయిన ఆఫ్ కామ్ ఆ ఛానెల్ కు 25 వేల పౌండ్ల జరిమానా విధించింది.క్యాన్సర్ ఇలా తులసి ఆకులు, నల్ల మిరియాలతో నయమవు తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని, క్వాలిఫై కాని వైద్య సలహాలు, సూచనలను ప్రసారం చేశారని ఆ ఛానెల్ పై ఈ సంస్థ మండిపడింది. పైగా ఇలాంటి షోలను చూసి ..ఇలాంటి డాక్టర్లను నమ్మి ఆ సలహాలను పాటించే రోగులకు చాలా హాని కలుగుతుందని అభిప్రాయపడింది. దీంతో మేల్కొన్న ఆ ఛానెల్..ఇది మానవ తప్పిదమేనని అంగీకరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







