బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.!
- June 29, 2021
బ్యాంక్ ఆఫ్ బరోడా-BOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్ విభాగంలో సీనియర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులు. మొత్తం 8 ఖాళీలున్నాయి. బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఫైనాన్స్ గవర్నెన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగాల్లో హెడ్ పోస్టుల్ని, ఫైనాన్స్ అకౌంటింగ్, ఇన్వెస్టర్ రిలేషన్స్‌లో డిప్యూటీ హెడ్ పోస్టుల్ని, బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్, ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ, బీయూ ప్రాఫిటబిలిటీ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్‌లో వైస్ ప్రెసిడెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 15 చివరి తేదీ. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు ఇవే:
మొత్తం ఖాళీలు- 8
హెడ్ (బిజినెస్ ఫైనాన్స్)- 1
హెడ్ (ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఫైనాన్స్ గవర్నెన్స్)- 1
హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్)- 1
డిప్యూటీ హెడ్ (ఫైనాన్స్ అకౌంటింగ్)- 1
డిప్యూటీ హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్)- 1
వైస్ ప్రెసిడెంట్ (బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్)- 1
వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ)- 1
వైస్ ప్రెసిడెంట్ (బీయూ ప్రాఫిటబిలిటీ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్)- 1
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎంబీఏ ఫైనాన్స్, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
అనుభవం- 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు
వయస్సు- హెడ్ పోస్టుకు 38 ఏళ్ల నుంచి 45 ఏళ్లు, డిప్యూటీ హెడ్ పోస్టుకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు, వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 32 ఏళ్ల నుంచి 40 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
IBPS RRB 2021: బ్యాంకుల్లో 12,958 జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి
Bank of Baroda Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్ పేజ్‌లో Current Opportunities పైన క్లిక్ చేయాలి.
నోటిఫికేషన్‌తో పాటు అప్లై లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.
అప్లై చేయాల్సిన పోస్ట్ సెలెక్ట్ చేసి, పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
టెన్త్, డిగ్రీ, ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తాజా వార్తలు
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!









