వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు

- March 09, 2016 , by Maagulf
వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు

వరుణునికి గల్ఫ్ దేశాల మీద కరుణ ఎక్కువై భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అబూ ధాబీ పాఠశాలలు బుధవారం  (మార్చి 9 న) మూతబడ్డాయి. ఈ విషయాన్ని అబూ ధాబీ విద్యా మండలి ఒక ట్వీట్ లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. ఈ కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.  దేశంలోని  వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సైతం  కారుమబ్బులు అలుముకొని  భారీ వర్షం కురిసె అవకాశాలు   ఉన్నాయి , దేశ రాజధాని ప్రాంతంలో మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు కురవడం జరిగింది,  ఎండల తర్వాత అమాంతంగా వచ్చిన వర్షం వల్ల దాదాపు వారాంతం మొత్తం తడి వాతావరణంతో నెలకొని ఉంది. నైరుతి యుఎఇ నుండి వస్తున్న అల్పపీడన పొడిగింపు ఇందుకు ప్రధాన కారణం. రాజధాని లో చెల్లాచెదురుగా వర్షం కురవడమే కాక ఆకాశం మేఘావృతమై మంగళవారం ఉదయం నగరం పట్టపగలే చిమ్మచీకట్లు చుట్టుముట్టాయి. నగరం సన్నటి చినుకులతో మేల్కొంది, మధ్యాహ్నం వేళ అయితే , భారీ వర్షం నగరం కుండపోతగా కురిసింది. పలువురు  నివాసితులు పరుగులు తీసుకొంటూ వర్షం నుంచి  ఆశ్రయం కోరుకొంటూ వేగంగా నడుస్తున్నట్లు కనిపించింది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com