పారువెల్ల ~ ఆనందం

చేతులకెంత  స్వార్థమున్నా
తల మీద పందిరి
అందరికీ ఒకటైనందుకు
అందనంత  దూరం ఉన్నందుకూ  ఆనందం

వర్ణాలు ఎన్ని వున్నా
రక్తం ఎరుపైనందుకు

తేడాలు ఎన్ని వున్నా
మట్టికి తోడైనందుకు
మొక్కకు ఎరువైనందుకూ ఆనందం

"నువ్వు"
అనే  ప్రశ్న పుడుతున్నప్పుడల్లా
"మరి నేను"  
అనే ఆలోచన ఆనందం

 

--పారువెల్ల 

Back to Top