డెల్టా వైరస్ ప్రమాదకరం: WHO
- July 03, 2021
జెనీవా: ప్రపంచం క్లిష్ట సమయంలో కొట్టుమిట్టాతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రాయాసిస్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో డెల్టా వేరియంట్ లాంటి వ్యాప్తి చెందే వైరస్లు ఉన్నాయని అన్నారు.డెల్టా వేరియంట్ అభివృద్ధి చెందడంతో పాటు రూపాంతరం చెందుతాయని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తక్కువ టీకా కవరేజ్ ఉన్న దేశాల్లో.. కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల్లోని భయానక దృశ్యాలు పరిస్థితులు ఉధృతికి దారితీయవచ్చునని అన్నారు. డెల్టా లాంటి తీవ్రంగా వ్యాప్తి చెందే వేరియంట్లు...చాలా దేశాల్లో అధిక ప్రభావాన్ని చూపుతున్నాయని, ప్రపంచం మరింత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు. కరోనా కట్టడికిి నిరంతర పరిశీలన అవసరమని, ప్రజారోగ్య ప్రతిస్పందనను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. ఈ వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించారని, తక్కువ, ఎక్కువ వ్యాక్సినేషన్ కవరేజ్ అనే తేడా లేకుండా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ కొత్త వైరస్‌ను తరిమికొట్టేందుకు రెండు మార్గాలున్నాయని చెప్పారు.
ప్రజారోగ్యం, సామాజిక చర్యలు ...పటిష్టమైన నిఘా, వ్యూహాత్మక పరీక్షలు, త్వరగా కేసులను గుర్తించడం, ఐసోలేషన్, క్లినికల్ కేర్ వంటివి చాలా ముఖ్యమైనవని చెప్పారు. మాస్క్, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాల్లో సమూహాలను నివారించడం, ఇండోర్ ప్రాంతాలు వెంటిలేషన్ సదుపాయాలు చూసుకోవడం ఉండాలని అన్నారు. ఆక్సిజన్, పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్లు ప్రపంచం సమానంగా షేర్ చేసుకోవాలన్న ఆయన...దీనికి ఒకరికొకరు సహకారం అందించుకోవాలని దేశాధినేతలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి 70 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని తెలిపారు. ఇవే మహమ్మారిని అదుపుచేసేందుకు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ఇవే సరైన మార్గాలని చెప్పారు. ఈ సెప్టెంబర్ నాటికి మీ దేశ జనాభాలో 10 శాతం మంది కైనా వ్యాక్సిన్ అందించాలని పలు దేశాలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్లు ఉత్పత్తికి సాంకేతికను పంచుకోవాలని బయో ఎన్‌టెక్, మోడార్నా, ఫైజర్ వంటి టీకా సంస్థలను కోరారు. దీని వల్ల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. త్వరలో వ్యాక్సినేషన్ హబ్‌లు ప్రారంభిస్తామని, ప్రపంచ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఎంత త్వరగా పెంచుతామో... అప్పుడు ప్రాణాంతక వైరస్‌లకు అంతమొందించగలమని అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







