భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే దేశాలు
- July 03, 2021
న్యూ ఢిల్లీ: కారులో షికారుకు వెళ్లేవారు చుట్టుపక్కల అందాలను చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటే ఎంతో ఎంజాయ్ ఉంటుంది.అదే విదేశాలలో ఈ ఎంజాయ్మెంట్ అంతా ఇంతా కాదు. ఇక అక్కడ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే భారత్‌కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ పది దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అక్కడి రోడ్లపై భారతీయులు డ్రైవింగ్ చేసే అవకాశం ఉంది.ఇండియన్ డ్రైవింగ్ లైసెన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశాల వివరాలు...
1.సింగపూర్:
సింగపూర్‌లో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దేశమంతా చుట్టేయచ్చు. భారత డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశంలో ఒక ఏడాది పాటు పని కొస్తుంది.
2.హాంగ్‌కాంగ్:
హాంగ్‌కాంగ్‌లోనూ ఏడాది పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుమతి ఉంది. ఎక్కువ రోజులు టూర్ ప్లానింగ్ చేసుకునే వారు ఈ దేశంలో వాహనాలు అద్దెకు తీసుకుని ఇండియన్ లైసెన్స్‌తో నడుపుకోవచ్చు.
3.మలేసియా:
మలేషియా రోడ్లపై వాహనాలు నడపాలనుకునే భారతీయులకు వారి డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్‌లో కానీ, మలైలో కానీ ఉండాలి. దానిని మలేషియాలో ఇండియన్ ఎంబసీ గుర్తించాల్సి ఉంటుంది.
4.జర్మనీ:
జర్మనీలో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడపవచ్చు. అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీషులో కానీ, జర్మనీలో కానీ ఉంటే అక్కడి అధికారులకు సులభంగా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది ఉండదు.
5.బ్రిటన్:
బ్రిటన్‌లో అయితే ఏడాది పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ దేశాలలో సంవత్సరం పాటు భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడుపుకోవచ్చు.
6.ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియాలోనూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆ దేశం అనుమతి ఇస్తుంది. అయితే చిన్న చిన్న షరతులు మాత్రం తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్‌లో ఉండాలి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు మూడు నెలల పాటు మాత్రమే అనుమతి ఉంటుంది. మనదేశంలోలాగే ఆస్ట్రేలియాలో కూడా ఎడమవైపే డ్రైవింగ్ చేయాలి.
7.న్యూజిలాండ్:
న్యూజిలాండ్‌లో బస చేసే విదేశీయులు తమ మాతృదేశ డ్రైవింగ్ లైసెన్స్‌తో నే ఏడాది పాటు వాహనాలు నడపవచ్చు.అయితే మీకు ఏ వాహనం నడపడానికి లైసెన్స్ మంజూరు అయి ఉందో ఆ వాహనం మాత్రమే నడపాలి. లేకపోతే అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు.
8.స్విట్జార్లాండ్:
స్విట్జార్లాండ్లో కూడా ఏడాది పాటు మన దేశ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపయోగించి వాహనం నడపుకోవచ్చు. ఇక్కడ మన లైసెన్స్‌తో వాహనాలు లీజుకు కూడా ఇచ్చుకోవచ్చు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీషులో ఉండాలి.
9.దక్షిణాఫ్రికా:
దక్షిణాఫ్రికాలో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. కాకపోతే లైసెన్స్ కాపీ ఇంగ్లీష్‌లో ఉండాలి. అంతేకాదు లైసెన్స్ ప్రస్తుత కాలానికి చెందినదిగా ఉండాలి. అలాగే దానిపై ఫోటో, సంతకం తప్పనిసరి.
10.స్వీడన్:
స్వీడన్లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుమతి ఇస్తారు. కానీ లైసెన్స్ ఇంగ్లీష్‌లో లేదా ఫ్రెంచ్, నార్వేనియన్లో ఉండాలి.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







