సంక్షోభంలోనూ లులు గ్రూప్ లో 3000 ఉద్యోగాలు

- July 04, 2021 , by Maagulf
సంక్షోభంలోనూ లులు గ్రూప్ లో 3000 ఉద్యోగాలు

యూఏఈ: కోవిడ్ మహమ్మారితో ఎంతో మంది ఉపాధి కొల్పోయిన ఈ సంక్షోభ సమయంలోనూ లులు గ్రూప్ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కొత్తగా మరో 3000 మందిని తమ సంస్థలో ఉద్యోగులుగా చేర్చుకుంది. యూఏఈతో పాటు మరికొన్ని దేశాల్లో మరో 30 హైపర్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నందున్నందున అందుకు అనుగుణంగా కొత్త నియామకాలు చేపట్టినట్లు లులు గ్రూప్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫలీ చెప్పారు. ఈ కొత్త నియామకాలతో లులు గ్రూప్ వర్క్ ఫోర్స్ 60,000కు పెరిగిందన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని కూడా తట్టుకొని తమ మార్కెట్ పరిధిని విస్తరించినట్లు వివరించారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి పలు దేశాల్లో 26 హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను ప్రారంభించామన్నారు. నాలుగు ఈ-కామర్స్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ లోని పలు రాష్ట్రాలు, సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com