అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ
- July 05, 2021
న్యూయార్క్ : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓ పదవి నుంచి నేడు తప్పుకోగా, ఆయన స్థానంలో ఆండీ జాస్సీ (53) నూతన సీఓఈగా బాధ్యతలు అందుకున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ ను 1994లో స్థాపించారు. అనతికాలంలోనే తిరుగులేని ఈ-కామర్స్ పోర్టల్ గా అమెజాన్ ఎదగడంలో బెజోస్ పాత్ర ఎనలేనిది. 1.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ శక్తిగా అమెజాన్ ను మలిచిన బెజోస్ తాను సీఈఓగా తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తన స్థానంలో ఆండీ జాస్సీ ఇకపై కంపెనీని నడిపిస్తారని వెల్లడించారు.
అమెజాన్ ఇప్పుడు ఈ-మార్కెట్ రంగంలోనే కాదు ఓటీటీ (అమెజాన్ ప్రైమ్), క్లౌడ్ కంప్యూటింగ్ ( అమెజాన్ వెబ్ సర్వీసెస్) రంగాల్లోనూ దూసుకుపోతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాసుల వర్షం కురిపించే సంస్థగా ఎదగడంలో నూతన సీఈఓ ఆండీ జాస్సీ కృషి ఎంతో ఉంది. వెబ్ సర్వీసెస్ రంగంలో ఆదాయాన్ని పసిగట్టిన జెఫ్ బెజోస్ ఏడబ్ల్యూఎస్ కు రూపకల్పన చేయగా, దాన్ని లాభాల బాట పట్టించింది ఆండీ జాస్సీ. జాస్సీ… ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా అందుకున్నారు. క్రీడల పట్ల మక్కువ చూపించే అమెజాన్ నూతన సీఈఓ తన ఇంటిలోనూ క్రీడా వేదికలను తలపించే నిర్మాణాలతో తన అభిరుచిని చాటుకున్నారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







