ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: మోదీ
- July 05, 2021
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందని, అదృష్టవశాత్తు సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్సుగా మార్చినట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలకు కోవిన్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. కోవిన్ యాప్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ సాధించినట్లు ఆయన చెప్పారు. కోవిన్ గ్లోబల్ సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేషన్ విధానం ఒక్కటే మానవళికి ఆశాకిరణం అన్నారు.
మన దేశంలో ముందు నుంచి వ్యాక్సినేషన్ కోసం డిజిటల్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అన్ని దేశాల్లోనూ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గత వందేళ్లలో ఇలాంటి మహమ్మారిని చూడలేదన్నారు. ఏ దేశమైనా, అది ఎంత శక్తివంతమైనదైనా, ఇలాంటి సమస్యను పరిష్కరించం అసాధ్యమన్నారు.
ఆరోగ్య సేతను యాప్ సక్సెస్ అయ్యిందని, 20 కోట్ల మంది ఆ యాప్‌ను వాడుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భారతీయ నాగరికత చూస్తుందని, మహమ్మారి వేళ ఈ తత్వాన్ని అందరూ అర్థం చేసుకున్నారని, అందుకే కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కోవిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేసినట్లు ప్రధాని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







