గల్ఫ్ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- July 06, 2021
కువైట్: గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్ GF215కి తృటిలో ప్రమాదం తప్పింది. బహ్రెయిన్ నుంచి కువైట్ చేరుకున్న విమానం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే..ఎలాంటి సమస్య లేకుండా ఫ్లైట్ ల్యాండ్ అయినట్లు విమానయాన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఫ్లైట్ లోని 62 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, వారిని ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కు తరలించామని వెల్లడించారు. అయితే..ల్యాండింగ్ సమయంలో తలెత్తిన మైనర ఇన్సిడెంట్ కి సంబంధించి కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి విచారిస్తున్నట్లు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







