కర్ఫ్యూ టైంలో స్టార్ హోటల్స్ కి ఊరట..రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్
- July 06, 2021
ఒమన్: కర్ఫ్యూ సమయాల్లోనూ స్టార్ హోటళ్లు రెస్టారెంట్లు, కేఫ్ లను నిర్వహించుకోవచ్చని ఒమన్ పర్యాటక శాక వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఫోర్, ఫైవ్ స్టార్ హోటల్స్ లోని ఔట్ లెట్స్ కు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే..హోటల్స్ లో బస చేసే అతిథులకు మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్ లలోకి అనుమతించాలని, బయటికి వ్యక్తులను అనుమతించకూడదని కూడా షరతు విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఒమన్ వ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో వాణిజ్య కేంద్రాలు, వాహనాలు, జన సంచారంపై నిషేధం అమలులో ఉంటుంది. అయితే..ఎమర్జెన్సీ సర్వీసులు, శానిటేషన్ వంటి సర్వీస్ వాహనాలు, ఫుడ్ డెలివరీ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చిన విషయం
తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







