హోం క్వారంటైన్ మార్గదర్శకాల్ని సవరించిన అబుధాబి
- July 06, 2021
అబుధాబి: అబుధాబి అథారిటీస్, హోం క్వారంటైన్ గైడ్‌లైన్స్‌ని సవరించడం జరిగింది. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అవుతారో వారికి సంబంధించి నిబంధనల్లో మార్పు చేశారు. వ్యాక్సినేషన్ పొందినవారు ఏడు రోజులపాటు క్వారంటైన్లో వుండాలి. ఆరవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ అయితే, రిస్ట్ బ్యాండ్ ఏడవ రోజున తొలగించవచ్చు. వ్యాక్సినేషన్ పొందనివారైతే 12 రోజులు క్వారంటైన్లో వుండాలి. 11వ రోజున పిసిఆర్ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ నెగెటివ్ వస్తే 12వ రోజున రిస్ట్ బ్యాండ్ తొలగించవచ్చు. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ కేసుతో కాంటాక్ట్ అవుతారో, వారు క్వారంటైన్ ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ అయితే, పిసిఆర్ టెస్టు కోసం ఫ్రీ వాక్ ఇన్ చేయొచ్చు. రిస్ట్ బ్యాండ్‌ని కోవిడ్ 19 ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలు జాయెద్ పోర్ట్, ముఫ్రాక్ హాస్పిటల్ మరియు అద్నెక్, అల్ యిన్ కన్వెన్షన్ సెంటర్, అల్ ఖుబియైసి మరియు మదినాత్ జాయెద్ - అల్ దఫ్రా అలాగే సెహా మాస్పిటల్స్ దఫ్రాలో తొలగించవచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







