ఏడాదికి 100 కోట్లు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు: కమీషనర్ సజ్జనార్
- July 06, 2021
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజు రోజు రెచ్చిపోతున్నారు. ఏడాదికి పలు రకాల ఆప్ లతో 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అని సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు. ఇతర నేరాల తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐదోవ తరగతి కూడా చదవని నేరగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఖాతాల నుండి డబ్బులు దోచేస్తున్నారు. Olx, క్వికర్, ఫ్లిప్ కార్ట్,99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, టీం వీవెర్, ఏని డెస్క్,ఎస్ బి ఐ, జియో, ఎయిర్టెల్ కస్టమర్ కేర్,అమెజాన్, టైమ్స్ జాబ్స్, నౌకరీ. కం. సోషల్ మీడియా వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విటర్, టెలిగ్రాం తదితర యాప్ లతో మోసాలు చేస్తున్నారు అని తెలిపారు.

అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడ వద్దు. జార్ఖండ్ అడ్డగా చేసుకున్న కేటుగాళ్లు…. ప్రజలకు అనుగుణంగా అన్నీ భాషల్లో మాట్లాడి మొసం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వారికి ఎక్కువ జీతం ఇస్తూ వారిని జార్ఖండ్ కు తీసుకొని వెళ్లి తెలుగులో మాట్లాడించి నేరాలకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్,శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి,డిసిపి ట్రాఫిక్ విజయ్ కుమార్,రాజేంద్ర నగర్ ఏసిపి సంజయ్ కుమార్,శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి కె.బాలకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







