‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ షురూ!
- July 06, 2021
హైదరాబాద్: ‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీ కానున్నారు. వీలైనంతా త్వరగా విడుదల తేదీని ప్రకటించి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. థియేటర్లు ఓపెన్ కాగానే విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమా ముందు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







