రష్యాలో పెరుగుతున్న డెల్టా కేసులు.. రికార్డుస్థాయిలో మరణాలు
- July 06, 2021
మాస్కో: రష్యాలో నేడు రికార్డుస్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 737 మంది మరణించారు. ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. కరోనాతో విలవిల్లాడిన తొలి ఐదు దేశాల్లో రష్యా కూడా ఒకటి. ప్రస్తుతం డెల్టా వేరియంట్ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనాకు కేంద్రంగా ఉన్న మాస్కోలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నగర మేయర్ సెర్గేయి సోబ్యానిన్ తెలిపారు.
వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్లో మూడొంతుల మందిని ఇంటికి పంపాలని కార్యాలయాలను మేయర్ ఆదేశించారు. అలాగే టీకాలు తీసుకున్న వారిని, గత ఆరు నెలల్లో కరోనా బారినపడి కోలుకున్న వారిని మాత్రమే అనుమతించాలని రెస్టారెంట్లను కోరారు. ఆగస్టు మధ్యనాటికి సేవారంగంలో ఉన్న వారిలో 60 శాతం పూర్తిగా టీకాలు తీసుకుని ఉండాలని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు నాటికి దేశంలోని 60 శాతం మందికి టీకాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రష్యాలో ఇప్పటి వరకు 1,39,316 మంది కరోనాతో మరణించారు. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదైంది రష్యాలోనే.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







