మోడీ క్యాబినెట్లో మరో కొత్తశాఖ!
- July 07, 2021
నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మరో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నారు. సహకార శాఖ పేరుతో ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసి అందుకు ఓ మంత్రిని కూడా నియమించనున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఈ విషయంపై చర్చలు జరగగా బుధవారం మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో నూతనంగా సహకార శాఖను ఏర్పాటు చేయాలని మోడీ నిర్ణయించగా.. త్వరలోనే ఇది ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సహకారంతోనే సమృద్ధి అనే విజన్‌ను అమలు చేసేందుకు ఈ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలపగా.. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుంది. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది.
కేంద్ర ఆలోచనలోని ఈ కొత్త సహకార శాఖకు బుధవారం కొత్త మంత్రిని నియమించే అవకాశం ఉండగా.. ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి, బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగు అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







