వాటర్ యాపిల్ లో విలువైన పోషకాలు ...
- March 09, 2016
చూడగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వాటర్ యాపిల్ ప్రయోజనాలను ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడ గుర్తిస్తున్నారు. అనేక దేశాల్లో అదృష్టానికి, ఐశ్యర్యానికి సంకేతంగా ఈ వాటర్ యాపిల్ ను భావిస్తారు. దీనిని గులాబ్ జామూన్, జావా యాపిల్, రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.ఈ చెట్టును మన ఇంటి వద్ద కుండీలలో కూడ పెంచుకోవచ్చు. మలేషియా, ఇండోనేషియా లాంటి అనేక దేశాల్లో ఎక్కువగా లభించే ఈ పండు ఇప్పుడు మన దేశంలో కూడా బాగా దొరుకుతోంది. ఈ వాటర్ యాపిల్ ను మనం నిత్యం మనం తినగలిగితే ఎన్నో ఊహించని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.విటమిన్లు, మినరల్స్, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఈ వాటర్ యాపిల్ తన పేరుకు తగ్గట్టుగానే దాహాన్ని తీరుస్తుంది.ప్రోటీన్లూ, పిండి పదార్థాలు, కొవ్వులు లేకపోవడంతో దీన్ని ఎంతైనా నిరభ్యంతరంగా తినవచ్చు. లావెక్కుతామేమో అన్న సమస్య ఉండనే ఉండదు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండును మంచి ఆహారంగా చెప్పవచ్చు. టైప్-1, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఈ పండు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే గుణాలు వాటర్ యాపిల్‌లో ఉన్నాయి. ఇందులోని విటమిన్లు పలు కంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. శరీరంలో తెల్లరక్త కణాలను ఈ వాటర్ యాపిల్ అభివృద్ధి చేస్తుంది. ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ లాంటి ఎన్నో విలువైన పోషకాలతో పాటుగా విటమిన్ 'బి' విటమిన్ 'సి' ఈ వాటర్ యాపిల్ లో సమృద్ధిగా ఉంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







