ఇజ్రాయిల్ నూతన అధ్యక్షుడిగా హెర్జోగ్ ప్రమాణం
- July 08, 2021
జెరూసలేం: ఇజ్రాయిల్ నూతన అధ్యక్షుడుగా ఇజాక్ హెర్జోగ్ (60) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రావెన్ రివ్లిన్ స్థానంలో దేశ 11వ అధ్యక్షుడిగా హెర్జోగ్ ప్రమాణం చేస్తారు. ఏడేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో వుంటారు.గత నెల్లో ఇజ్రాయిల్ పార్లమెంట్ ఆయనను అధ్యక్ష పదవికి ఎన్నుకుంది.లేబర్ పార్టీ అధినేతగా పనిచేసిన ఆయన పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2018లో రాజకీయాలు వీడిన తర్వాత యూదుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ చీఫ్గా వున్నారు.హెర్జోగ్ తండ్రి చైమ్ హెర్జోగ్ కూడా 1980వ దశకంలో అధ్యక్షుడిగా వున్నారు. అంతకుముందు ఆయనన ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్ రాయబారిగా వున్నారు.ఆయన తాత దేశ ప్రధమ చీఫ్ రబ్బిగా వున్నారు.ఆయన అంకుల్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఇజ్రాయిల్ సమాజంలో తీవ్ర విభేదాలు నెలకొన్న సమయంలో బాధ్యతలు స్వీకరించడంపై హెర్జోగ్ స్పందిస్తూ, తాను ప్రతి ఒక్కరి అధ్యక్షుడిగా వుండేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇజ్రాయిల్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. ప్రధాని నఫతాలి బెన్నెట్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే హెర్జోగ్ బాధ్యతలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







