పరిణీతి చోప్రాతో మహేష్ మూవీ
- March 09, 2016
శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల కలెక్షన్లు సాధ్యం చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత భారీగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న రాజకుమారుడు, ఆ సినిమాలో ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. వేసవి కానుకగా మేలో బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.బ్రహ్మోత్సవం సినిమా తరువాత మరోభారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు ప్రిన్స్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.తెలుగు తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.గతంలో ప్రీతిజింటా, నమ్రతా శిరోద్కర్, బిపాషాబసు, లిసారే, అమృత రావ్ లాంటి బాలీవుడ్ భామలతో జోడీ కట్టిన మహేష్, ఈసారి పరిణీతి చోప్రాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







