గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనలు
- March 09, 2016
ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల చర్చ గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి. రెండు పడవలు వెళ్లగలిగేలా మార్గాన్ని వదలిపెట్టి కొత్త వంతెనలను నిర్మించేలా నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. రెండువైపులా ఒకేసారి రెండు పడవలు వెళ్లేందుకు వీలుగా 70-80 మీటర్ల వెడల్పు, 40-50 మీటర్ల ఎత్తుతో ఈ మార్గం ఉంటుంది. భవిష్యత్తులో రెండు నదులపై నిర్మించే అన్ని వంతెనలకు ఇదే నమూనా సిద్ధం చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.బుధవారం ఆయ న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీ-ప్లస్ వన్ పద్ధతిలో వాటి నమూనాను అధికారులు రూపొందించారు. ఒక్కో ఇంటికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉన్నం దున స్థలసేకరణ, ఇతరత్రా అనుమతులకు కసరత్తు ప్రారంభించాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1400 కి.మీ. జాతీయ రహదారులకు సంబంధించి వెంటనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాలు-మండల కేం ద్రాల అనుసంధాన రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలోని అన్ని ఖాళీలు, పదోన్నతుల భర్తీపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రోడ్ల విభాగం ఈఎన్‌సీ రవీందర్‌రావు, జాతీయ రహదారులు, భవనాల ఈఎన్‌సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







