అమెరికాలో తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా డెల్టా వేరియంట్
- July 08, 2021
న్యూయార్క్: అమెరికాపై డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్ వేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ తెలిపింది. కరోనా వేరియంట్లలో డెల్టా చాలా స్పీడుగా ఉందని చెప్పింది. అమెరికాలో అనేక ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులు డెల్టా వేరియంట్ వే.కరోనా తొలి నాళ్లలో ఆల్ఫా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు కాగా… ఇప్పుడు వాటి సంఖ్య 28.7 శాతానికి తగ్గింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఫౌచి మాట్లాడుతూ… ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపుతోందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత ప్రమాదకారిగా మారుతుందని అన్నారు.
కాగా, కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకుతోంది. అయితే, ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి.వీరికి కరోనా సోకినా, ప్రాణగండం మాత్రం లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!







