వీరమరణం పొందిన ఏపీ జవాన్
- July 09, 2021
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందాడు.రాజౌరీ జిల్లాలోని సుందర్‌బాని సెక్టారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.అలాగే,ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేటి రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది.
కాగా, జశ్వంత్‌రెడ్డి 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరాడు.తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో నెల రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







