హజ్ పర్మిట్ లేకుండా మక్కాలోకి ఎంట్రీ..52 మంది అరెస్ట్
- July 09, 2021
సౌదీ: హజ్ పర్మిట్ లేకుండా పవిత్ర మక్కాలోకి ప్రవేశించిన 52 మందిని అరెస్ట్ చేసినట్లు హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండ్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి మక్కాలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి SR10,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. హజ్ పర్మిట్ ఉన్న భక్తులనే పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి ఎంట్రీ ఉంటుంది. అనుమతి లేని వారిని అడ్డుకునేందుకు నిబంధనలు అతిక్రమిస్తే SR10,000 ఫైన్ విధించనున్నట్లు భద్రతా దళాలు ఇదివరకే ప్రకటించాయి. అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెడతూ హజ్ పర్మిట్ లేకుండానే పవిత్ర మసీదు, సెంట్రల్ హరామ్ ఏరియా, మినా, ముజ్దలిఫా, అరాఫత్ ప్రాంతాల్లోకి ఎంటరైన 52 మందిని అరెస్ట్ చేసి ఫైన్ విధించారు.ఇదే తప్పును పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







