ఖతార్ లో భారత మామిడి ప్రమోషన్కు అపార అవకాశాలు: భారత రాయబారి
- July 09, 2021
దోహా: ఖతార్ లో మామిడి పళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఖతార్ భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ అన్నారు. ఖతార్ పౌరులు, ప్రవాసీయులు మామిడి రుచి అస్వాదించటంలో ఎప్పుడు ముందుంటారని ఆయన అన్నారు. అందుకే భారత్ నుంచి ఖతార్ కు మామిడి ఎగుమతిపై దృష్టిసారించాలని, అందుకు తమ రాయబార కార్యాలయం నుంచి కావాల్సినంత సహాకారం ఉంటుందన్నారు. అగ్రికల్చర్& ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ-APEDA ఆధ్వర్యంలో పశ్చిమబెంగాళ్ లో జరిగిన మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ లో దీపక్ మిట్టల్ పాల్గొన్నారు. భారత్ నుంచి ఖతార్ కు పళ్లు, కూరగాయలు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. మామిడి పళ్ల ప్రమోషన్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, APEDA చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సమావేశంలో APEDA చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, పశ్చిమ బెంగాల్ డైరెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ & హార్టికల్చర్ కమిషనర్ జయంత పాల్గొన్నారు. ఇదిలాఉంటే...ఈ ప్రమోషన్ ప్రోగ్రాంలో భారత ఈశాన్య ప్రాంత భౌగోళిక గుర్తింపు ఉన్న 8 రకాల మామిడి పళ్లను ప్రదర్శించారు.
--రాజ్ కుమార్ వనాంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







