హజ్ పర్మిట్ లేకుండా మక్కాలోకి ఎంట్రీ..52 మంది అరెస్ట్
- July 09, 2021సౌదీ: హజ్ పర్మిట్ లేకుండా పవిత్ర మక్కాలోకి ప్రవేశించిన 52 మందిని అరెస్ట్ చేసినట్లు హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండ్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి మక్కాలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి SR10,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. హజ్ పర్మిట్ ఉన్న భక్తులనే పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి ఎంట్రీ ఉంటుంది. అనుమతి లేని వారిని అడ్డుకునేందుకు నిబంధనలు అతిక్రమిస్తే SR10,000 ఫైన్ విధించనున్నట్లు భద్రతా దళాలు ఇదివరకే ప్రకటించాయి. అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెడతూ హజ్ పర్మిట్ లేకుండానే పవిత్ర మసీదు, సెంట్రల్ హరామ్ ఏరియా, మినా, ముజ్దలిఫా, అరాఫత్ ప్రాంతాల్లోకి ఎంటరైన 52 మందిని అరెస్ట్ చేసి ఫైన్ విధించారు.ఇదే తప్పును పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు